కేరళలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటన

Metro Man E Sreedharan will be BJP's CM Candidate in Upcoming Kerala Assembly Elections

కేరళ రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధికి సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక ప్రకటన చేసింది. ఇటీవలే బీజేపీ పార్టీలో చేరిన మెట్రో మ్యాన్, ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ ‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. త్వరలో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలు-2021 కు బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ.శ్రీధరన్ ఉంటారని కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు.

ముందుగా దేశంలో మెట్రో మ్యాన్ గా పిలవబడే శ్రీధ‌ర‌న్ ఫిబ్రవరి 25 న కేరళలోని మలప్పురంలో పార్టీ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అధికారికంగా బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా బీజేపీ పార్టీలో చేరడం తన జీవితంలో గొప్ప సందర్భాలలో ఒకటని పేర్కొన్నారు. పదవీ విరమణ అప్పటినుండి గత 10 సంవత్సరాలుగా కేరళలో నివసిస్తున్నానని, వేర్వేరు ప్రభుత్వాలను చూశాను కానీ వారు ప్రజల కోసం చేయగలిగిన స్థాయిలో చేయడం లేదని అన్నారు. తన అనుభవంతో తగిన కృషి చేసేందుకే బీజేపీలో చేరుతునట్టు చెప్పారు. పార్టీ నిర్ణయిస్తే ముఖ్యమంత్రి కూడా అభ్యర్థిగా ఉంటానని పేర్కొన్నారు. దేశ రవాణా రంగంలో పెనుమార్పులకు కృషి చేసిన శ్రీధరన్ ఎంతో పేరు గడించారు. 88 సంవత్సరాల శ్రీధరన్ బీజేపీ పార్టీలో చేరబోతున్నాయని, కేరళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా శ్రీధరన్ ను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =