ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్ ను పునరుద్ధరించాలి, మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి

Minister KTR Meets Union IT and Railways Minister, Union IT and Railways Minister Ashwini Vaishnaw, New Delhi, Mango News, Telangana News, Telangana Breaking News, Minister KTR, Union Minister Ashwini Vaishnaw, Ashwini Vaishnaw, Railway Minister Ashwini Vaishnaw, Railway Minister of India 2021, Union IT Minister Ashwini Vaishnaw, New Delhi Latest News, KTR Meets Railways Minister Ashwini Vaishnaw

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌ ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అంశాలపై కేంద్రమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్‌) ప్రాజెక్ట్ ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగ వృద్ధిలో ఎంతగానో దోహదపడే ఈ ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని గత 6 సంవత్సరాలగా సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వానికి ఎన్నోమార్లు లేఖలు రాసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

దివిటిపల్లిని EMC-2.0 (ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్) స్కీమ్ కింద ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ మరియు విస్తరణ మద్దతు కోసం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి పెట్టడానికి దుండిగల్ వద్ద 450 ఎకరాల భూమి గుర్తించబడిందని చెప్పారు. గ్రామ పంచాయితీలను అనుసంధానించడానికి టిఫైబర్ కింద భారత్ నెట్ ఫేజ్-II ప్రాజెక్ట్ అమలు కింద (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్, భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్) తో చేసిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం చెల్లింపులను విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్) ఫేజ్-I నెట్‌వర్క్‌ ను టిఫైబర్ కి అప్పగించాలని, గ్రామ పంచాయతీల నుండి ఇంటి వరకు గ్రామాలను (ఆవాసాలను) అనుసంధానించే ప్రాజెక్టుకు 1200 కోట్ల అదనపు నిధుల అందించాలని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 10 =