నెట్స్ లో విరాట్ కోహ్లీకి ద్రావిడ్ సలహాలు

Coach Rahul Dravid gives batting tips to skipper Virat Kohli, Coach Rahul Dravid Working on Virat Kohli’s Batting, Head Coach Rahul Dravid Tips To Captain Virat Kohli In Nets, India vs South Africa, India vs South Africa 2021, India vs South Africa Match, India vs South Africa match news, India vs South Africa match updates, India vs South Africa Test Series, Mango News, Mango News Telugu, Rahul Dravid Gave Batting Tips To Virat Kohli, Rahul Dravid gives batting tips to Virat Kohli, Rahul Dravid Works On Virat Kohli’s Batting, South Africa Vs India

టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో తీవ్రంగా చెమటోడుస్తోంది. మొదటగా జరుగనున్న టెస్ట్ సిరీస్ పై దృష్టి పెట్టింది. దక్షిణాఫ్రికాలో ఉండే పిచ్ లు స్వతహాగా సీమ్ బౌలింగ్ కి అనుకూలిస్తాయి. దక్షిణాఫ్రికా జట్టులో ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడి పిచ్ లకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. అలాంటి పిచ్ లపై వేగంతో దూసుకువచ్చే బంతులను ఆడటం మాములు విషయం కాదు. ఏమాత్రం అంచనా తప్పినా వికెట్ సమర్పించుకోవలసిందే. అందుకే టీమిండియా ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య కాలంలో భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. విరాట్ ఆడిన లాస్ట్ 13 మ్యాచ్ లలో అత్యధిక స్కోరు 74 మాత్రమే. విరాట్ టెస్టుల్లో సెంచరీ సాధించి 2 సంవత్సరాలు అవుతోంది. అతడు చివరిసారిగా 2019 నవంబర్ లో బంగ్లాదేశ్ పై శతకం బాదాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క శతకం కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు కోహ్లీయే. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇండియా బ్యాటింగ్ భారం ఎక్కువగా కోహ్లీపైనే పడనుంది. దీంతో అతను తన బ్యాటింగ్ టెక్నిక్ లో ఉన్న లోపాలపై దృష్టి పెట్టాడు. దీంట్లో భాగంగానే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో తన బ్యాటింగ్ గురించి దీర్ఘంగా చర్చించాడు. ద్రావిడ్ సూచనల మేరకు నెట్ ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దక్షిణాఫ్రికా లో సిరీస్ గెలుచుకోవాలంటే కెప్టెన్ కోహ్లీ ఫామ్ లోకి రావటం ఇండియాకి అత్యంత కీలకం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 10 =