వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీలక అడుగు

Telangana Cabinet Takes Key Decision on Mamunur Airport at Warangal,Telangana Cabinet Takes Key Decision,Key Decision on Mamunur Airport,Decision on Mamunur Airport at Warangal,Mango News,Mango News Telugu,Telangana cabinet key decision,Warangal,Mamunur Airport, Airport Terminal Building,Nakkalapalli, Gadepalli,Flight connectivity,Telangana Cabinet Latest News,Telangana Cabinet Latest Updates,Telangana Cabinet Live News,Key Decision on Mamunur Airport News Today,Key Decision on Mamunur Airport Lastest News,Key Decision on Mamunur Airport Live Updates

వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మామునూరు విమానాశ్రయ ఏర్పాటుపై కీలక అడుగు పడింది. వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్, ప్రస్తుత రన్‌వే పొడిగింపు కోసం 253 ఎకరాల అదనపు స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1930 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఎయిర్‌పోర్ట్ తర్వాత నిజాం పాలనలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో వర్తక వాణిజ్యాలకు మామునూరు ఎయిర్‌పోర్ట్‌ ఉపయోగపడింది. 1981 సంవత్సరంలో మామునూరు ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వ 2018 నుంచి చురుగ్గా పనిచేస్తోంది. వరంగల్ జిల్లా వాసులు అనేకమార్లు మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పునరుద్ధరణకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. వడివడిగా అడుగులు పడుతున్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే ఈ సంవత్సరం విమానాశ్రయ విస్తరణ కోసం అదనపు భూమిని సేకరించేందుకు సర్వే పూర్తి చేయగా ఖిల్లా వరంగల్ మండలంలో త్వరలోనే భూసేకరణ చేయనున్నారు.

విమానాశ్రయం విస్తరణకు ఖిల్లా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గాడేపల్లి, మామునూరు గ్రామాల నుంచి విమానాశ్రయ అభివృద్ధికి కొన్ని భూములను గుర్తించారు. వాటిని సేకరించాలని నిర్ణయించారు. ప్రతిఫలంగా రైతులకు వేరే చోట భూములను కేటాయించనున్నారు. రైతుల భూములను సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి బదిలీ చేస్తారు. తద్వారా ప్రస్తుత 1.8 కి.మీ రన్‌వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలు దొరుకుతుంది.

ఆపై బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలకు కూడా మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి వెసులుబాటు దొరుకుతుంది. వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ జరిగితే చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు విమాన కనెక్టివిటీ అందుతుందని, కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు, వ్యాపార వృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని వరంగల్ జిల్లా వాసులు చెబుతున్నారు. వరంగల్లో పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న క్రమంలో పర్యాటకులను పెద్దసంఖ్యలో ఆకర్షించటానికి కూడా ఎయిర్‌పోర్ట్ దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =