టీ20 ప్రపంచ కప్-2022: సెమీఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచిన న్యూజిలాండ్

New Zealand Become the First Team to Qualify for T20 World Cup 2022 Semi-finals, First Team to Qualify for T20 World Cup 2022 Semi-finals, New Zealand Become the First Team, T20 World Cup 2022 Semi-finals, T20 World Cup, New Zealand first team to seal semifinal spot, T20 World Cup 2022, 2022 T20 World Cup Semi-finals, ICC T20 World Cup 2022 Semi-finals, New Zealand, Semi-finals, T20 World Cup 2022 Semi-finals News, T20 World Cup 2022 Semi-finals Latest News And Updates, T20 World Cup 2022 Semi-finals Live Updates, Mango News, Mango News Telugu

టీ20 ప్రపంచ కప్-2022 లో సూపర్-12 రౌండ్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతూ క్రీడాభిమానులు విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. కాగా సూపర్-12 మ్యాచులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్-2022లో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. శుక్రవారం అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించడంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూపర్-12లో గ్రూప్-1 లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లుతో ఉన్న న్యూజిలాండ్ తమ ఐదు మ్యాచులను పూర్తిచేసుకుంది. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం ఏడు పాయింట్లు మరియు +2.11 నెట్‌ రన్‌రేట్ తో న్యూజిలాండ్ జట్టు గ్రూప్-1 లో మొదటి స్థానంలో నిలిచి, సెమీస్ కు అర్హత సాధించింది.

గత 7 సంవత్సరాలగా న్యూజిలాండ్ జట్టు ఐసీసీ టోర్నమెంట్స్ లో అత్యంత నిలకడగా రాణిస్తుంది. ఐసీసీ టోర్నమెంట్స్ లో ఖచ్చితంగా అద్భుత ప్రదర్శన చేసే జట్టుగా న్యూజిలాండ్ పేరు సంపాదించుకుంది. 2016 టీ20 ప్రపంచ కప్ లో సెమీ ఫైనలిస్ట్ గా, 2021 టీ20 ప్రపంచ కప్ లో రన్నరప్‌ గా నిలిచిన న్యూజిలాండ్, మరోసారి 2022 టీ20 ప్రపంచకప్‌లో కూడా సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది.

న్యూజిలాండ్ సెమీస్ కు చేరిన విధానం(సూపర్-12 – గ్రూప్-1 – 7 పాయింట్స్ – +2.113 నెట్‌ రన్‌రేట్):

  • అక్టోబర్ 22 – ఆస్ట్రేలియాపై 89 పరుగుల తేడాతో విజయం
  • అక్టోబర్ 26 – ఆఫ్ఘనిస్థాన్ పై వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
  • అక్టోబర్ 29 – శ్రీలంకపై 65 పరుగులతో తేడాతో విజయం
  • నవంబర్ 1 – ఇంగ్లాండ్ పై 20 పరుగులతో పరాజయం
  • నవంబర్ 4 – ఐర్లాండ్ పై 35 పరుగులతో తేడాతో విజయం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =