బెంగాల్ కోసం 25 కోట్లకు పెగాసస్‌ స్పైవేర్‌ ఆఫర్ చేశారు, కానీ నేను ఒప్పుకోలేదు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

NSO Offered To Sell Pegasus Spyware For Bengal But I Rejected That Offer Says CM Mamata Banerjee, CM Mamata Banerjee Says NSO Offered To Sell Pegasus Spyware For Bengal, NSO Offered To Sell Pegasus Spyware, Pegasus Spyware, NSO, NSO Offered To Sell Pegasus Spyware For 25 Crores, But I Rejected That Offer, NSO Offered To Sell Pegasus Spyware For Bengal, CM Mamata Banerjee, Mamata Banerjee, Chief Minister of West Bengal, West Bengal CM Mamata Banerjee, Bharatiya Janata Party, BJP, Mango News, Mango News Telugu,

భారత్‌లో గతేడాది రాజకీయంగా కలకలం రేపిన ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తయారు చేసిన పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవస్థపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ సైబర్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ నాలుగేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ పోలీసు డిపార్టుమెంట్ కు తమ స్పైవేర్ విక్రయించడానికి వచ్చినట్లు తెలిపారు. రూ.25 కోట్లకు పెగాసస్‌ స్పైవేర్ విక్రయిస్తామని ఆ సంస్థ ఒక ప్రతిపాదన చేసిందని.. కానీ, స్పైవేర్‌ను రాజకీయంగా ఉపయోగించుకోవడం, న్యాయమూర్తులు మరియు అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు కాబట్టి, నైతిక విలువలకు కట్టుబడి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మమత వెల్లడించారు.

అయితే మన దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్‌లను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రధాని నర్రేంద మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మరియు భద్రత కోసం అయితే, అది వేరే విషయం కావచ్చు. కానీ ఇది రాజకీయ కారణాల కోసం ఉపయోగించబడింది, పైగా ఇది అధికారులు మరియు న్యాయమూర్తులపై ఉపయోగించటం ఆమోదయోగ్యం కాదు అని మమత తెలిపారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నేను ఏం మాట్లాడినా వెంటనే తెలిసిపోతుంది. మూడేళ్ల కిందట నాకు కూడా పెగాసస్‌ కొనాలని ఆఫర్‌ వచ్చింది. కానీ నేను కొనలేదు. ప్రైవసీలో జోక్యం చేసుకోవడంపై నాకు నమ్మకం లేదు. వాక్ స్వాతంత్య్రానికి అడ్డుకట్ట వేస్తుంది. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలు పెగాసస్‌ను కొనుగోలు చేశాయి అని మమతా బెనర్జీ ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 3 =