అమెరికాలో ప్రముఖ వ్యక్తులు, ధనవంతులని లక్ష్యంగా చేసుకుని వారి ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్లు దాడి చేశారు. బ్లూ టిక్ కలిగిన ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు పెట్టారు. వారి ఖాతాల బిట్‌కాయిన్ అడ్రస్‌కి 1000 డాలర్లు పంపిస్తే, తిరిగి వెంటనే 2000 రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ పోస్ట్ చేశారు. హ్యాకింగ్ కు గురైన ట్విట్టర్ ఖాతాలలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, త్వరలో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, ప్రపంచ ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, ఎలాన్ మస్క్, నటి కిమ్ కర్ధాషియన్, కాన్యేవెస్ట్, మైకేల్ బ్లూమ్‌బెర్గ్, ఆపిల్, ఉబర్, విజ్ ఖలీఫా వి సహా ఇతర ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలు హ్యాక్ అయిన విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ టీం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ విషయంపై ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే స్పందిస్తూ “ట్విట్టర్లో మాకు కఠినమైన రోజు. హ్యాకింగ్ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై మేము నిర్ధారణ చేస్తున్నాము. సరిగ్గా ఏమి జరిగిందో మాకు పూర్తి అవగాహన కలిగినప్పుడు, అందరితో వివరాలను పంచుకుంటామని” వెల్లడించారు.
Tough day for us at Twitter. We all feel terrible this happened.
We’re diagnosing and will share everything we can when we have a more complete understanding of exactly what happened.
💙 to our teammates working hard to make this right.
— jack (@jack) July 16, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu