మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కేబినెట్ ఆమోదం

Punjab Cabinet Approved Free Travel within the State for All Women From April 1st

ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని మహిళలకు ఏప్రిల్ 1, గురువారం నుండి ప్రభుత్వ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. బుధవారం నాడు సీఎం అమరీందర్ సింగ్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 1.31 కోట్లకు పైగా మహిళలు/బాలికలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించే పథకానికి పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. పంజాబ్ లోని మహిళలను సాధికారత దిశగా నడిపించడంలో ఈ నిర్ణయం బలమైన దశ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నానని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.

ముందుగా మార్చి నెల ప్రారంభంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం అమరీందర్ సింగ్ హామీ ఇచ్చారు. ఇకపై పంజాబ్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పిఆర్‌టిసి), పంజాబ్ రోడ్‌వేస్ బస్సులు, అలాగే సిటీ బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏసీ, వోల్వో మరియు హెచ్‌విఎసి బస్సుల్లో ఈ సౌకర్యం వర్తించదని చెప్పారు. ఇక ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందేందుకు‌ రాష్ట్రానికి చెందిన వారుగా ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేదా పంజాబ్‌లో నివసిస్తున్నట్టు సరిఫికేట్ చూపించాల్సి ఉంటుందని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + four =