కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం, మాస్క్ లేకుంటే రూ.500 వరకు ఫైన్

Indian Railways, Indian Railways decision to check Covid transmission, Indian Railways to impose Rs 500 fine, Mango News, Not Wearing Masks In Railway Premises, Railways, Railways Decided to Impose Fine, Railways Decided to Impose Fine upto Rs 500, Railways Decided to Impose Fine upto Rs 500 for not Wearing Masks in Rail Premises, Railways To Fine Rs 500 For Not Wearing Face, Railways to fine Rs 500 for not wearing face masks, Railways To Fine Rs 500 For Not Wearing Masks In Rail, Railways to impose fine up to Rs 500 for not wearing masks

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో, ప్రజా రవాణా సమయంలో మాస్క్‌ ధరించడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించని వారికీ జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో మరియు రైళ్లలో మాస్కులు/పేస్ కవర్ ధరించని వారికీ రూ.500 వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఫేస్ మాస్క్‌లపై ఈ ఆదేశాలు ఆరు నెలల వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

కరోనా రెండో వేవ్ లో వైరస్ వ్యాప్తి చెందకుండా భారతీయ రైల్వే వివిధ చర్యలు తీసుకుంటుంది. అయితే రైళ్లలో మరియు రైల్వే స్టేషన్లలో ఫేస్ మాస్క్ నిబంధనలను ప్రయాణికులు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలోనే జరిమానా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతను ప్రభావితం చేసే విధంగా ఉమ్మివేయడం మరియు అలాంటి స్వభావం గల చర్యలకు వ్యతిరేకంగా కూడా జరిమానా విధించబడుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =