తెలంగాణలో త్వరలో వైద్యారోగ్య శాఖలో 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ – మంత్రి హ‌రీష్ రావు

Minister Harish Rao Launches T Diagnostics Hub and Mobile App at Narsingi Today, Minister Harish Rao Starts T Diagnostics Hub and Mobile App at Narsingi, Minister Harish Rao inaugurated T Diagnostics Hub and Mobile App at Narsingi, Minister Harish Rao inaugurates T Diagnostics Hub and Mobile App at Narsingi, Minister Harish Rao Launches T Diagnostics Hub at Narsingi, Minister Harish Rao Launches Mobile App at Narsingi, Minister Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Finance Minister of Telangana, Telangana Finance Minister, T Harish Rao Telangana Finance Minister, Telangana Minister Harish Rao, T Diagnostics Hub, Mobile App, Narsingi, Mango News, Mango News Telugu,

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఈరోజు టీ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు. అలాగే టీ డ‌యాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖ‌ను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే త్వ‌ర‌లోనే వైద్యారోగ్య శాఖ‌లో 13 వేల ఖాళీలను భర్తీ చేయనున్నామని తెలిపారు. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంద‌ని మంత్రి వెల్లడించారు. రక్త పరీక్షలతో సహా ఇతర ప‌రీక్ష‌ల నిమిత్తం ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో టీ డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశామని, ఈ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో ఉచితంగా 57 ర‌కాల ప‌రీక్ష‌లు చేస్తారని తెలిపారు.

ముందు ముందు మరో 137 రకాల వైద్య ప‌రీక్ష‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. హైద‌రాబాద్‌లో మొత్తం 20 వరకు రేడియోల‌జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ వంటి పలు సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు. వైద్య ప‌రీక్ష‌ల వివ‌రాల‌ను టీ డ‌యాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, రిపోర్ట్స్ కూడా దీనిద్వారా పొందొచ్చని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు సాధారణ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా వైద్యశాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. నిరుపేద‌ల‌ కోసం బ‌స్తీల్లో సుమారు 350 ఆస్పత్రులను ప్రారంభించామని, పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 10 =