అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్‌కు తొలి విజయం

Trumps First Victory In The US Presidential Election Race,Trumps First Victory In The US,US Presidential Election Race,Victory In The US Presidential Election,Donald trump, America, Republican party, America president elections,Mango News,Mango News Telugu,Donald Trump Wins 1st Republican Contest,Trump wins big in lowa,expected but important victory,Donald Trump swept to victory,Donald Trump Latest News,Donald Trump Live Updates,US Presidential Election Latest News,US Presidential Election Live Updates
Donald trump, America, Republican party, America president elections

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోన్న డొనాల్డ్ ట్రంప్‌ను వరుస చిక్కులు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. వరుసగా ట్రంప్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటి వరకు ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఓసారి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. పట్టు విడువని విక్రమార్కుడిలా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.

అయితే వరుస చిక్కల్లో ట్రంప్ ఇరుక్కుంటున్న వేళ.. ఆయనకు ఊరట కలిగించే ఘటన చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌కు మొదటి విజయం దక్కింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిదయిన.. అయోవా కాకసస్ ఎన్నికల్లో ట్రంప్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 51 శాతం ఓట్లతో ట్రంప్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 21.2 శాతం ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రెండో స్థానంలో.. ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ 19.1 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భారత సంతతి నేత వివేక్ రామస్వామికి కేవలం 7.7 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

తొలి పోలింగ్‌లో ట్రంప్ విజయం సాధించడంతో.. ఆయన అనుచరులు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని అంటున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరుపున అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ.. అయోవా కాకసస్ ఎన్నికలతో మొదలయింది. ఇక త్వరలోనే న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ ఫలితాల ఆధారంగా రిపబ్లికన్ పార్టీ తరుపున అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు.

అయితే ఇప్పటికే ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా డొనాల్డ్ ట్రంప్‌పై రెండు రాష్ట్రాలు వేటు వేశాయి. మైన్, కొలరాడో రాష్ట్రాలు ట్రంప్‌పై అనర్హత వేటు వేశాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి ట్రంప్ అనర్హుడని తేల్చి చెప్పాయి. దీనిపై ట్రంప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరి ఎన్నికల ముందు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది.. ట్రంప్‌కు ఊరట కలుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 11 =