జొమాటో వేసిన బిల్లుకు అవాక్కైన మహిళ

Zomato Clarifies After Woman Flags Unfair Container Fee with Food Bill at Ahmadabad,Zomato Clarifies After Woman Flags,Woman Flags Unfair Container Fee,Woman Zomato Food Bill at Ahmadabad,Mango News,Mango News Telugu,Woman shocked by Zomato's bill, Woman shocked, Zomato's bill, Khushboo Thakkar, Ahmedabad, Food packing Container charge,Zomato Food Bill at Ahmadabad,Zomato Food Bill at Ahmadabad Latest News,Zomato Food Bill at Ahmadabad Latest Updates,Ahmadabad Woman shocked,Ahmadabad Zomato Bill Latest News,Ahmadabad Zomato Bill Latest Updates

జొమాటో యాప్ ద్వారా ఆహారాన్ని తెప్పించుకున్న ఓ మహిళ వారు వేసిన బిల్లు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీనిపై ట్విటర్ వేదికగా జొమాటోకు ఫిర్యాదు చేసింది. బిల్లుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆమె ట్యాగ్ చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ఖుష్బూ ఠక్కర్ అనే మహిళ మూడు ప్లేట్లు తెప్లా జొమాటో ద్వారా ఆర్డర్ చేశారు. డెలివరీ సమయంలో బాయ్ ఇచ్చిన బిల్లు చూసిన ఆమె అవాక్కైంది. అందులో మూడు ప్లేట్ల ఆహారానికి రూ.180 బిల్లు వేసి.. దీంతో పాటు కేవలం ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే కంటైనర్లకు రూ.60 వసూలు చేస్తున్నట్లు చూపించారు.

అంటే మూడు ప్లేట్ల తెప్లా రూ.180 బిల్లు కాగా.. కేవలం ఫుడ్ ప్యాకింగ్ కంటైనర్‌ ఛార్జీల కోసం.. ఎక్స్ ట్రాగా రూ.60 చెల్లించాలని బిల్లులో ఉంది. అయితే ఆమె ఆర్డర్ చేసిన డిష్‌లోని ఒక్కో ప్లేట్‌ తెప్లా ఖర్చు కూడా రూ.60, కంటైనర్ చార్జీ కూడా రూ.60 ఉండటంతో ఆవేదన చెందిన ఆ మహిళ ఫుడ్‌ కంటైనర్‌ వసూలు ఛార్జీలు ఇంత చేస్తున్నారేంటని.. సోషల్ మీడియా వేదికగా జొమాటోను ట్యాగ్ చేస్తూ వారిని ప్రశ్నించింది. అంతేకాదు ఆమె తన బిల్లు స్క్రీన్‌షాట్‌ను కూడా ఆన్ లైన్ లో షేర్ చేసింది. మితిమీరిన, అన్యాయమైన కంటైనర్ ఛార్జీపై.. తాను అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు ఫుడ్ డెలివరీ కంపెనీ దీనిపై వివరణ ఇవ్వాలని గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన ఖుష్బూ ఠక్కర్ డిమాండ్ చేసింది. తాను ఆర్డర్ చేసిన ఆహారానికి సమానంగా.. కంటైనర్ ధరలను వసూలు చేస్తారా? అంటూ ప్రశ్నించింది. కంటైనర్ పేరుతో అదనంగా సొమ్ము వసూలు చేశారంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

చివరకు ఖుష్బూ జొమాటో ఫిర్యాదుపై.. జొమాటో కంపెనీ స్పందించింది. కంటైనర్ ఛార్జీలను రెస్టారెంట్లు మాత్రమే విధిస్తాయని చెప్పింది. హాయ్ ఖుష్బూ.. పన్ను విధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది.. ఆర్డర్ చేసిన ఫుడ్‌కు అనుగుణంగా 5 శాతం నుంచి 18 శాతం పన్ను ఛార్జీలుంటాయి. దీంతోపాటు రెస్టారెంట్లు ప్యాకేజీ ఛార్జీలను విధిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. ఈ మార్గంలో కూడా వారు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తెలుసుకోవాలంటూ జొమాటో బదులిచ్చింది. ఖుష్బూకు జొమాటో ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఆర్డర్ చేసేముందు ప్యాకేజీ ఛార్జీలు చూసుకొని ఉండాల్సింది అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =