భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన

bcci, BCCI Announced Team India Squad for ODI Series, BCCI Announced Team India Squad for ODI Series Against England, Ind vs Eng, India ODI team, India ODI team announced, India squad for England ODIs, India vs England, India’s squad for Paytm ODI series against England, Mango News, Team India Squad for ODI Series Against England, Team India Squad for Paytm ODIs Series

భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ శుక్రవారం నాడు ప్రకటించింది. యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిద్ కృష్ణ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ జట్టులో ఉన్న మనీష్ పాండే, సంజు సామ్సన్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, బుమ్రా, మహమ్మద్ షమీ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్ కు ఎంపిక కాలేదు. కరోనా నేపథ్యంలో 3 వన్డేలను కూడా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోనే‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

భారత్ వన్డే జట్టు:

 1. విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌)
 2. రోహిత్‌ శర్మ (వైస్ కెప్టెన్)
 3. కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్)‌
 4. శిఖర్‌ ధావన్
 5. శుబ్ మన్ గిల్ ‌
 6. శ్రేయస్‌ అయ్యర్‌
 7. సూర్యకుమార్‌ యాదవ్‌
 8. హార్దిక్‌ పాండ్య
 9. రిషభ్‌ పంత్‌ (వికెట్ కీపర్)
 10. క్రునాల్ పాండ్య
 11. యుజువేంద్ర చాహల్‌
 12. కుల్దీప్ యాదవ్
 13. ‌వాషింగ్టన్ సుందర్
 14. భువనేశ్వర్ కుమార్ ‌
 15. టి.నటరాజన్
 16. ‌ప్రసిద్ కృష్ణ
 17. మహమ్మద్ సిరాజ్
 18. శార్దూల్‌ ఠాకూర్‌

వన్డేల షెడ్యూల్ :

 • మొదటి వన్డే – మార్చి 23 – పూణే
 • రెండ‌వ వన్డే – మార్చి 26 – పూణే
 • మూడవ వన్డే – మార్చి 28 – పూణే
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − four =