ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘డిప్రెషన్ నుంచి బయట పడటం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారని అన్నారు. సాధారణంగా చాలామందికి డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నామనే సంగతి కూడా తెలియదని చెప్పారు. ఆందోళన, భయం, కంగారు, అభద్రతా భావంతో బాధపడేవారు ముందుగా తమ సమస్యను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాలని అన్నారు. డిప్రెషన్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు, డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం పాటించాల్సిన సూత్రాలు వంటి పలు అంశాలను ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]