అయ్యప్ప ప్రసాదం గురించి మీకీ విషయాలు తెలుసా?

Do you know about Ayyappa Prasad,About Ayyappa Prasad,Ayyappa Prasad,Aravana Prasad, Aravana Prasad is delicious,Ayyappa Prasad,Sabarimala, Ayyappa Swamy,Sabarimala Ayyappa Swamy,Mango News,Mango News Telugu,Why Lord Ayyappans Prasad very tasty,Sabarimala,Story of the famous Ayyappa Prasadam,Aravana Payasam Prasad,Ayyappa Prasad Latest News,Ayyappa Prasad Latest Updates
Aravana Prasad, Aravana Prasad is delicious,Ayyappa Prasad,Sabarimala, Ayyappa Swamy,Sabarimala Ayyappa Swamy

కఠినమైన అయ్యప్పమాల దీక్షను 41రోజులు పాటు చేస్తూ .. దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు..  శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళతారు. అయితే వారంతా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చే స్వామివారి ప్రసాదం అంటే చాలామంది ఇష్టపడతారు.  డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండే ఈ ప్రసాదం చూడటానికి పాకంలా నల్లగా ఉంటున్నా తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. అందుకే అయ్యప్ప దర్శనం కోసం కేరళ వెళ్లే స్వాములతో ఏరికోరి ఆ ప్రసాదాన్ని తెప్పించుకుంటారు కొంతమంది. ఈ ప్రసాదాన్ని  అరవణ ప్రసాదంగా పిలుస్తారు.

నిజానికి భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా  అయ్యస్వామి అరవణ ప్రసాదం గుర్తింపు పొందింది. 41 రోజులు కఠోర ఆహార నియమాలతో, కఠిన దీక్ష పూర్తి చేస్తారు. ఆ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామికి ఇరుముడులు సమర్పించి.. అక్కడి నుంచి ప్రసాదంగా అభిషేకం చేసిన నెయ్యితో పాటు   అరవణ ప్రసాదంను కూడా తీసుకొస్తారు.  అయ్యప్పస్వామి దేవాలయంలో లభించే ఈ  అరవణ ప్రసాదం ఎంతో రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా అని అంటుంటారు.  ముఖ్యంగా అరవడి పాయసాన్ని చలికాలంలో  తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెబుతారు.

అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు.. యాత్ర ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు స్వామివారి ప్రసాదాలయిన అరవణ ప్రసాదం, అప్పం తప్పకుండా తీసుకుంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అనేక పోషక పదార్ధాల మిళితం అయిన అరవణ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చలికాలంలో అరవణ ప్రసాదం తినడం వల్ల శరీరంలో వేడిని కలిగిస్తుందని నిపుణులు చెబుతారు.

మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్న చెట్టికులంగర దేవి ఆలయం నుంచి .. అరవణ ప్రసాదానికి వాడే బియ్యం వస్తాయి. ప్రతి ఏడాది అయ్యప్ప దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల మంది దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తుంటారు.అయితే అయ్యప్ప భక్తుల కోసం ప్రతి ఏడాది 80 లక్షల వరకూ అరవణ ప్రసాదం డబ్బాలను తయారు చేస్తారట.

తిరుమల తరువాత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల అని అధికారులు చెబుతున్నారు.అంతేకాదు..తిరుమల లడ్డు తర్వాత అరవణ ప్రసాదానికే  అంత ప్రాచుర్యం ఉంది. ఒక్కో ప్రసాదం డబ్బా 250 గ్రాముల బరువు ఉంటుంది. ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండకుండా చూడటానికి.. మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ సభ్యులలు సలహాదారులుగా ఉంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =