తెలంగాణలో 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ

11 IAS officers transferred in Telangana,11 IAS officers transferred,officers transferred in Telangana,CM Revanth reddy, IAS Officers, Arvind kumar, Telangana government,Mango News,Mango News Telugu,Significant administrative reshuffle,Transfer of 11 IAS Officers,Special Chief Secretary Arvind Kumar,Telangana Government Transfers,IAS officers transferred Latest News,IAS officers transferred Latest Updates,IAS officers transferred Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
CM Revanth reddy, IAS Officers, Arvind kumar, Telangana government

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఒక్కో శాఖపై అవగాహన పెంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక విభాగాల్లో రేవంత్ రెడ్డి బదిలీ ప్రక్రియను చేపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తన టీమ్‌ను ఎంపిక చేసుకోవడంలో రేవంత్ రెడ్డి మార్క్ చూపిస్తున్నారు. ఈక్రమంలో మరోసారి బదిలీ ప్రక్రియ చేపట్టిన రేవంత్ రెడ్డి.. కీలక అధికారులపై బదిలీ వేటు వేశారు. మొత్తం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు.

అరవింద్ కుమార్.. ప్రస్తుతం ఈయన పురపాలక శాఖ కమిషనర్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దిగ్గజ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందంటే.. దాని వెనుక ఈయన కృషి ఎంతగానో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ ప్రత్యేక ఫోకస్ పెట్టి అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అరవింద్ కుమార్‌పై బదిలీ వేటు వేశారు. విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్‌గా అరవింద్ కుమార్‌ను నియమించారు.

అదే సమయంలో పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ బాధ్యతలను రేవంత్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్‌కు అప్పగించారు. ప్రస్తుతం దానకిషోర్ జలమండలి ఎండీగా విధులు నర్వర్తిస్తున్నారు. అలాగే ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశంను సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అటు రవాణా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వాణీ ప్రసాద్‌ను అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా ట్రాన్స్‌ఫర్ చేశారు. రోడ్డు భవనాల శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న కేఎస్ శ్రీనివాస్‌ను రవాణా శాఖ కార్యదర్శిగా.. రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీ నుంచి జీఏడీ సెక్రటరీగా రేవంత్ రెడ్డి బదిలీ చేశారు.

అటు ఏంఏయూడీ సెక్రటరీగా ఉన్న సుదర్శన్ రెడ్డిని జలమండలి ఎండీగా.. ఆర్థిక శాక కార్యదర్శిగా పనిచేస్తున్న టీకే శ్రీదేవిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించారు.  నల్గొండ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్వీ కర్ణన్‌ను హెల్త్ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను బదిలీ చేశారు. ఈ మేరకు బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 18 =