శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 23 వ పాఠంలో కథలో మార్పులు ఎలా చేయాలి? ఏఏ సందర్భాల్లో మార్పులు చేస్తే విజయవంతమైన సినిమాగా రూపుదిద్దుకుంటుందనే విషయాలను వివరించారు.
కథ వేగంగా చెబుతున్నామా, ఉత్సాహభరితంగా వెళుతుందా లేదా అనే అంశాన్ని కథ ఆర్డర్ రాసుకున్నప్పుడే చూసుకోవాలని అన్నారు. ఎప్పుడైతే రాసుకున్న కథను ఒక్క వాక్యంలో లేదా ఇక నిమిషంలో చెప్పగలుగుతారో అప్పుడే కథలోనూ, కథ మీద పట్టు ఉన్నట్టని చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్ లో స్క్రిప్ట్ ఎడిటింగ్ మరియు సీన్ ఎడిటింగ్ కూడా పరుచూరి గోపాలకృష్ణ గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]