శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 18వ పాఠంలో సినిమాలలో సంభాషణలు ఎలా ఉండాలి? చమత్కారానికి, వెటకారానికి మధ్యగల తేడా లేంటి? ఆహ్లాదమైన సంభాషణలు ఎలా రాసుకోవాలి? అనే విషయాలను వివరించారు. ప్రయోజకత్వం ఉండేలా సంభాషణలు ఎలా రాసుకోవాలో తెలియజేయడంతో పాటుగా పలు సినిమాల్లో సంభాషణల యొక్క ప్రభావాన్ని ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]