శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలను ఎలా పెంచాలి” అనే అంశం గురించి వివరించారు. చిన్న వయస్సు వారికి, పెద్ద వాళ్ళకి ఒక విషయం పట్ల ప్రతిస్పందించే తీరు, ఆకళింపు చేసుకునే విధానం వేర్వేరుగా ఉంటాయని కొన్ని సందర్భాలను ఉదాహరణగా తీసుకుని వివరించారు. అలాగే ఎప్పుడైతే చేసే పనికి, చూస్తున్న దానికి సామీప్యత, అవగాహాన ఉండదో ఆరు రకాల రోగాలకు గురిఅయ్యే అవకాశం ఉందన్నారు. కుటుంబం అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనీ, అంతే తప్ప టీవీ చూస్తూనో, మరో పనిలో ధ్యాస పెట్టి భోజనం చేయకూడదని, ఇలాంటి అలవాట్లు వేరే పరిస్థితులకు ఏ విధంగా దారితీస్తాయో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]