విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, 2nd T20I Against Sri Lanka, Captain Kohli Breaks Du Plessis World Record, India vs Sri Lanka 2nd T20I, latest sports news, latest sports news 2020, Mango News Telugu, sports news

భారత్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తన పేరుపై మరో అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. జనవరి 7న శ్రీలంకతో జరిగిన రెండో టీ20 ద్వారా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంతవేగవంతమైన 1000 పరుగుల రికార్డు ఇంతకుముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ పేరిట ఉండేది. డుప్లెసిస్‌ 31 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధిస్తే, విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. కేవలం ఆరుగురు కెప్టెన్స్ మాత్రమే టీ20ల్లో 1000 పరుగుల మార్కును దాటారు. ఈ జాబితాలో కోహ్లీ, డుప్లెసిస్‌ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36), ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (42), విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (54), ఎంఎస్‌ ధోనీ (57) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ రికార్డుతో పాటుగా శ్రీలంక మ్యాచ్‌లో 30 పరుగులు సాధించడంతో కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో 2,663 పరుగులుతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ ముందున్నాడు. ఇక 2,633 పరుగులతో భారత్ జట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here