తెలంగాణ రాష్ట్రంలో నిర్వ హించాల్సిన వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందుగా మే 15వ తేదీవరకు, ఆ తర్వాత మే 31 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. తాజాగా జూన్ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, ఈసెట్, పీజీ ఈసెట్, పీ ఈసెట్, పీజీ ఎల్సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు దరఖాస్తు గడువు పెంచడంతో మరో అవకాశం లభించినట్లయింది.
మరోవైపు ఇటీవలే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:
- ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ – జూలై 6 నుంచి 9 వరకు
- ఈసెట్ – జూలై 4
- ఐసెట్ – జూలై 13
- పీజీ ఈసెట్ – జూలై 1 నుంచి 3 వరకు
- ఎడ్సెట్ – జూలై 15
- లాసెట్ మరియు పీజీ లాసెట్ – జూలై 10
- పీఈసెట్ – త్వరలో ప్రకటన
- పాలీ సెట్ – జూలై 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu