ఎమ్మెల్యేగా నేడు ఏడోసారి ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం

Big embarassment for speaker as Etela takes oath as MLA, BJP Leader Eatala Rajender, BJP Leader Eatala Rajender Speech, BJP Leader Eatala Rajender Takes Oath as MLA, BJP Leader Eatala Rajender Takes Oath as MLA Today, Eatala Rajender, Eatala Rajender News, Eatala Rajender Takes Oath as MLA, Ex-Minister Eatala Rajender takes oath as BJP MLA, Focus on assembly polls, Mango News, Pocharam Srinivas Reddy, Speaker Pocharam Srinivas Reddy

హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నవంబర్ 10, బుధవారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటల రాజేందర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొని ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద ఈటల రాజేందర్​ నివాళులు అర్పించారు.

ముందుగా గత అక్టోబర్ 30న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఏడోసారి నేడు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =