ఎన్నికల వేళ ఐటీ రైడ్స్‌తో బీజేపీ మార్క్ రాజకీయం?

BJP mark politics with IT raids during elections,BJP mark politics with IT raids,IT raids during elections,politics with IT raids,Mango News,Mango News Telugu,ID attacks , Congress leaders, Congress,BJP,Political Row Erupts, BJP mark politics,IT raids during elections,IT raids Latest News,IT raids Latest Updates,BJP Latest News,BJP Latest Updates,Congress Latest News,Congress Latest Updates,Political Row Erupts Latest News,Political Row Erupts Latest Updates
ID attacks , Congress leaders, Congress,BJP, BJP mark politics,IT raids during elections

ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై మాత్రం ఐటీ అధికారులు విరుచుకుపడుతున్నారు. ఈ ఐటీ దాడుల వెనుక ఉన్నది బీజేపీ -బీఆర్ఎస్ పార్టీలేనా అన్న సందేహం అందరికీ వస్తోంది.తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరిగిపోతున్నాయి. అది కూడా కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్ అవుతున్నాయి.

 

తాజాగా కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగాయి. అంతకుముందు మహేశ్వరంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి నివాసంలోనూ సోదాలు చేశారు. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి.  మరికొంతమంది కాంగ్రెస్ నేతల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడి చేశారు.అయితే  ఎన్నికల వేళ కేవలం కాంగ్రెస్ లీడర్ల పైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?  బీజేపీ, బీఆర్ఎస్ నేతల జోలికి మాత్రం ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న ఇప్పుడు సగటు ఓటరుకు వస్తుంది.

 

చాలా సర్వేలు చెబుతున్న ప్రకారం తెలంగాణాలో బలంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. నేరుగా చెప్పాలంటే కారు పంక్ఛర్ అవడం ఖాయం అని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి ఎవరి సపోర్టు లేకుండానే వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ తన మార్కు రాజకీయం మొదలుపెట్టిందని టాక్. ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలో అయినా తమకు పోటీ అనుకున్న పార్టీపై బీజేపీ ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేయిస్తుందనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి.

 

ఇప్పుడు తెలంగాణాలో కూడా ఆ ఆరోపణలు నిజమని బీజేపీ ప్రూవ్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఐటీ దాడుల అంశంలో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉండే ఉంటుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీయే. దాన్ని బలహీనపరిచేందుకు ఇలా ఐటీ అధికారులను రంగంలోకి దించినట్టు అర్థమవుతోంది.

 

కాంగ్రెస్ నాయకులపై జరుగుతున్న ఐటీ దాడులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. కేవలం కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేసి దాడులు చేయించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారాయన. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఎందుకు ఐటీ రైడ్స్ జరగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణాలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని, అందుకే బీజేపీ – బీఆర్ఎస్ భయపడుతున్నాయని అన్నారు. ఆ సునామీని ఆపేందుకే ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారని చెప్పారు. నవంబర్ 30న వచ్చే కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమని ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =