125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పనులపై మంత్రి వేముల సమీక్ష

Minister Vemula Prashanth Reddy held Review on Ambedkar Statue Secretariat Warangal Hospital Construction Works,Minister Vemula Prashanth Reddy.held Review on Ambedkar Statue,Vemula Review Secretariat,Vemula Review on Warangal Hospital,Vemula Review on Construction Works,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న పలు ప్రతిష్టాత్మక నిర్మాణాలపై మంగళవారం నాడు మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన పలుకట్టడాలపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.

హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. విగ్రహంతో పాటు నిర్మాణ ప్రాంగణంలో అంబేద్కర్ జీవిత చరిత్రను వివరిస్తూ, ప్రధాన ఆకర్షణగా నిలిచే మ్యూజియం ఫోటో గ్యాలరీ, ఆయన ప్రసంగాల వీడియోలు,సినిమా ప్రదర్శించే థియేటర్, ప్రాంగణం ముందు భాగం పార్లమెంట్ ఆకృతి వచ్చే నిర్మాణాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం కేసీఆర్ కు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అంటే అపార గౌరవమని, సీఎం ఆదేశాల ప్రకారం అంబేద్కర్ జయంతి నాటికి స్మృతి వనం ప్రారంభించుకునే విధంగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల పురోగతిపై కూడా చర్చించారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అన్నారు.

నిర్మాణ చివరి దశలో ఉన్న సూర్యాపేటతో పాటు పలు జిల్లాల సమీకృత కలెక్టరేట్ల నిర్మాణ పురోగతిపై, ప్రారంభానికి సిద్దంగా ఉన్న నూతన కలెక్టరేట్లపై చర్చించారు. దీంతో పాటు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాయాల నిర్మాణాలకు సంబందించిన పలు అంశాలపై చర్చించారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పనుల పురోగతితో పాటు హైదరాబాద్ నలువైపులా నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలపై అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. నిర్మాణాలకు సంబందించిన పలు డిజైన్లు ఈ సందర్బంగా పరిశీలించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాలు శాఖ ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈ హఫీజుద్దిన్, ఈ.ఈ శశిధర్, పలువురు ఆర్కిటెక్ట్ లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =