పటాన్‌చెరులో తెగని సీట్ల పంచాయితీ

Jaggareddy vs Rajanarsimha,Jaggareddy,Rajanarsimha,Clashes Between Congress Leaders,Damodar Raja Narasimha,Congress, Jaggareddy, Rajanarsimha, Patancheru, Telangana Election 2023, Telangana Election,BRS,Mango News,Mango News Telugu,Jaggareddy Latest News,Jaggareddy Latest Updates,Damodar Raja Narasimha Latest News,Damodar Raja Narasimha Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Congress, Jaggareddy, Rajanarsimha, Patancheru, Telangana Election 2023, Telangana Election,BRS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న రోజుకో పంచాయితీ బయటపడుతోంది. ఇప్పటి వరకూ పార్టీలో అంతర్గతంగా జరిగే లొల్లి అంతా వీధిన పడుతోంది. టికెట్ ఆశించి భంగపడి కొందరు, పార్టీలో తన ఉనికికి మనుగడ లేదని మరికొందరు,  కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం నచ్చని ఇంకొందరు ఇలా రకరకాల కారణాలతో సొంత పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు.ఇప్పుడు ఈ  లిస్టులో  సీనియర్‌ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ చేరారు.

 

అవును తాజాగా పటాన్‌చెరు టికెట్‌ విషయంలో కాంగ్రెస్ సీనియర్‌ నేతలయిన జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య తీవ్ర దుమారమే రేగినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ పటాన్ చెరు నియోజవర్గం టికెట్‌ను తమవారికి ఇవ్వాలంటే.. తమవారికి ఇవ్వాలని  పట్టుబట్టి కూర్చున్నారు.ఇలా నీలం మధుకు జగ్గారెడ్డి మద్దతు పలకగా, కాట శ్రీనివాస్‌గౌడ్‌కు రాజనర్సింహ మద్దతు పలుకుతున్నారు.

 

మూడో జాబితాలో పటాన్‌చెరువు టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నీలం మధుకు కేటాయించడంపై దామోదర రాజనర్సింహ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా  కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తున్న కాట శ్రీనివాస్‌గౌడ్‌ను కాదని, నాలుగు రోజుల క్రితం  హస్తం పార్టీలో చేరిన నీలం మధుకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని..మధుకు ఇచ్చిన టికెట్‌ను రద్దు చేసి..దానిని శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసువస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే  దామోదర రాజనర్శింహ డిమాండ్‌పై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.  శ్రీనివాస్ గౌడ్‌కు ఇచ్చిన టికెట్‌ను రద్దు చేస్తే ఊరుకునేది లేదంటూ.. పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇటు  పఠాన్‌చెరు, నర్సాపూర్‌, నారాయణఖేడ్‌ టికెట్లను తాను చెప్పిన వారికి కాకుండా  ఇతరులకు ఆ టికెట్లు కేటాయించడంపై దామోదర రాజనర్శింహ ఆగ్రహంతో ఉన్నారు. తాను సూచించిన వారిలో  ఏ ఒక్కరికి కూడా టికెట్‌ దక్కకపోవడం ఏంటని దామోదర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు, పటాన్‌చెరు టికెట్‌కు సంబంధించి ఏకంగా  రూ.30 కోట్ల డీల్‌ కుదిరినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 18 =