ఎన్నికల ముందు పెరిగిపోతున్న కాంగ్రెస్ అసంతృప్తులు

Leaders who are leaving the Congress Party,Leaders who are leaving,leaving the Congress Party,who are leaving the Congress,Mango News,Mango News Telugu,Congress Leaders, leaving the Congress,Congress, Congress growing, elections, Telengana Elections,BRS, BJP,list of Congress leaders who resigned,Congress Party Latest News,Congress Party Latest Updates,Congress Party Live News,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
Congress Leaders, leaving the Congress,Congress, Congress growing, elections, Telengana Elections,BRS, BJP

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు తమకే వస్తాయని ఆశించి  భంగపడినవాళ్లు, పార్టీల్లో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ వస్తున్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి హస్తం గూటికి .. కాంగ్రెస్ నేతలు కారెక్కడం.. కమలం  కండువా పక్కన పెట్టి హస్తం గూటికి చేరడాలు కామన్‌గా  జరిగిపోతున్నాయి. అయితే వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ లోకి చేరడంతో.. రాజకీయ విశ్లేషకులు కూడా కాంగ్రెస్ విజయంపై అంచనాలు పెంచుకుంటున్నారు.

 

అయితే కాంగ్రెస్‌లోకి వలసల వర్షం కురుస్తోందనుకుంటున్న ఈ  సమయంలోసీనియర్లు ఒక్కొక్కరు  ఆ పార్టీని వీడుతుండటంతో అధిష్టానం అయోమయంలో పడుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్  కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఆపార్టీకి పెద్ద షాకే ఇచ్చారు.

 

తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు వంశీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో . ఈ ఇద్దరికీ కూడా కాంగ్రెస్ టికెట్లు ఫిక్స్ చేసింది. చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ వంశీకి.. అలాగే పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్‌కు ఇవ్వబోతున్నారని.. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని తెలుస్తోంది.  దీంతో చెన్నూరు  టికెట్ ఆశించిన బోడ జనార్ధన్ తీవ్ర అసంతృప్తికి లోనై రాజీనామా చేసి కారెక్కుతున్నారు.

 

పార్టీలో సభ్యత్వం లేని మాజీ ఎంపీ వివేక్‌ను ఎన్నికల సమయంలో ఇలా  తెర మీదకు తేవడం అన్యాయమని.. అధిష్టానం నిర్ణయాన్ని బోడ జనార్థన్ తప్పుబట్టారు. కోట్ల రూపాయలకు కాంగ్రెస్‌లో  టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.  నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే ఏకతాటిపైన కనిపించిన నేతలంతా.. పార్టీలో టికెట్ల వ్యవహారంతో ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు. టికెట్ దక్కని నేతలకు కనీసం రాష్ట్ర కాంగ్రెస్ సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సీనియర్లు వేరే పార్టీలకు ప్రయాణమవుతున్నారు.

 

ఆదిలాబాద్ జిల్లాలో పేరున్న సాజిద్ ఖాన్.. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి  రిజైన్ చేయగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి.. గండ్ర సుజాత కూడా రిజైన్ చేశారు. వీరిదారిలోనే నడిచిన సంజీవరెడ్డి.. పార్టీకి సోమవారం రాజీనామా చేసి రేవంత్ రెడ్డి వైఖరిని బహిరంగంగా నిరసించారు.

అలాగే బోథ్ నియోజ వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పుపైనా కూడా  ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి.  సోమవారం రాత్రి ప్రకటించిన జాబితాలో… ఇప్పటికే టికెట్ కన్ఫామ్ అయిన అశోక్ ని తప్పించి.. ఆడే గజేంద్రకు టికెట్ ఇవ్వడంపై  పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.

అంతేకాదు గతంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నరేష్ జాదవ్ కు టికెట్ ఇవ్వకపోవడం పైన కూడా నియోజవర్గంలో నిరసనలు  వ్యక్తం అవుతున్నాయి. దీంతో మరికొంత మంది నేతలు కూడా ఎన్నికల ముందు పక్క పార్టీలకు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 1 =