తగ్గిన కాంగ్రెస్ గ్రాఫ్.. దూసుకెళ్తున్న కారు

Reduced congress graph a speeding car Reduced congress graph a speeding car,Reduced congress graph,a speeding car Reduced congress graph,Mango News,Mango News Telugu,brs, congress, bjp, telangana intentions,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Reduced congress graph Latest News,Reduced congress graph Latest Updates
brs, congress, bjp, telangana intentions

తెలంగాణలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. ఎన్నికల పోరులో ఆయా పార్టీల అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. అందరికంటే ముందే గులాబీ బాస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. ఇటు కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించాయి. ఓవైపు టికెట్ దక్కినవారంతా ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తుంటే.. టికెట్ రానివారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలు మారేందుకు ప్లాట్‌ఫామ్ రెడీ చేసుకుంటున్నారు.

ఈ వారం పొలిటికల్ గ్రాఫ్ కూడా ఛేంజ్ అయింది. మొన్నటి వరకు అనూహ్యంగా బలపడిన కాంగ్రెస్ రెండు, మూడు వారాలుగా డౌన్ ఫాల్ వైపు చూస్తోంది. అటు గులాబీ బాస్ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ.. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఈవారం బీఆర్ఎస్ గ్రాఫ్ కాస్త పెరిగింది. అటు బీజేపీ గ్రాఫ్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈవారం బీజేపీ గ్రాఫ్ యథాతథంగా ఉంది.

ప్రతివారంలానే ఈవారం కూడా తెలంగాణ ఇంటెన్షన్స్ సంస్థ సర్వే చేసి.. సంచలన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. పోయిన వారం 40 శాతంగా ఉండగా.. ఈవారం 2 శాతం పెరిగింది. అటు కాంగ్రెస్‌కు 32 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. పోయినవారం 33 శాతం ఉండగా.. ఈవారం ఒకశాతం తగ్గింది. బీజేపీకి పోయినవారంలానే ఈవారం కూడా 10 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక హంగ్ ఏర్పడే అవకాశం ఈవారం పెరిగింది. పోయినవారం హంగ్ ఏర్పడే అవకాశం 7 శాతం ఉండగా.. ఈవారం 2 శాతం పెరిగి 9 శాతంగా ఉంది. నాట్ షూర్ ఓట్లు 7 శాతంగా ఉన్నాయి. పోయిన వారం నాట్ షూర్ ఓట్లు 9 శాతంగా ఉండగా.. ఈవారం 2 శాతం తగ్గాయి.

రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి బీఆర్ఎస్ మేనిఫెస్టో తోడ్పడుతుందని.. 67 శాతం మంది ఓటర్లు విశ్వసిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు దీటుగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని నమ్ముతున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందని 61 శాతం మంది ఓటర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు.. ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో తోడ్పడుతుందని 44 శాతం మంది ఓటర్లు చెబుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చదని 19 శాతం మంది ఓట్లు అంటున్నారు.

అటు 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితాను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసంతృప్తి రగిలిపోతోంది. టికెట్ ఆశించిన వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగినప్పటికీ.. అసంతృప్తులను సంతృప్తి పరచలేకపోయారు. బస్సు యాత్ర చేపట్టి జనాల్లోకి వెళ్లినప్పటికీ.. జనాలను, ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. అటు గులాబీ బాస్ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ.. హోరెత్తిస్తున్నారు. ఓవైపు ఓటర్లను ఆకట్టుకుంటూనే.. ప్రత్యర్థులపై భగ్గుమంటున్నారు. అటు జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తాని ప్రకటించినప్పటికీ.. బీజేపీ గ్రాఫ్ యథాతథంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + seven =