తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్‌

Central Election Commission, Central Election Commission Gives Green Signal for PRC, Central Election Commission Gives Green Signal for PRC Announcement, Central Election Commission Gives Green Signal for PRC Announcement in Telangana, EC gives green signal to Telangana govt for PRC, Election Commission gives nod to PRC announcement, Employee Associations on PRC, Mango News, Pay Revision Commission, PRC, PRC Announcement in Telangana, telangana, Telangana CM KCR, Telangana PRC report, TS PRC Report Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ (వేతన సవరణ) ప్రకటనకు అంతా సిద్ధమైంది. పీఆర్సీ ప్రకటనపై రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. ముందుగా ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్దమవగా, రాష్ట్రంలో రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో వాయిదా పడింది. ఆ ఎన్నికలు పూర్తైన సమయానికి తాజాగా నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కూడా ‌షెడ్యూల్‌ విడుదల కావడంతో పీఆర్సీ ప్రకటన చేసేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ సీఈసీ అనుమతి కోరింది.

ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు స్పందిస్తూ, పీఆర్సీపై ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే ఉపఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో పీఆర్సీపై ప్రచారం చేయరాదని, అలాగే ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని సూచించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నాడు ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30% ఫిట్‌మెంట్‌ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే పదవీవిరమణ వయసు పెంపుపై కూడా నిర్ణయం వెలువడనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =