సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు: సీఎం కేసీఆర్

CM KCR Extends Greetings to the People of Banjara on the Occasion of 284th Birth Anniversary of Sant Sevalal Maharaj,Sant Sevalal Maharaj Book,Sant Sevalal Maharaj Jayanti 2022,Sant Sevalal Maharaj Birth Place,Mango News,Mango News Telugu,Sevalal Maharaj Story,Sevalal Maharaj Birth Date,Sevalal Maharaj Wikipedia,Sant Sevalal Maharaj Photo,Sant Sevalal Maharaj History In Marathi,Sant Sevalal Maharaj History In Kannada,Sant Sevalal Maharaj Information In Marathi,Sant Sevalal Maharaj Jayanti,Sant Sevalal Maharaj Photo Hd,Sant Sevalal Maharaj Jayanti 2021,Shri Sant Sevalal Maharaj Photo,Shri Sant Sevalal Maharaj,Sant Sevalal Maharaj History,Sant Shri Sevalal Maharaj,Sant Shri Sevalal Maharaj Photo,Santosh Sevalal Maharaj Photo

బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ లంబాడా/బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బంజారా హిల్స్ గా పిలవబడుతున్న ప్రాంతంలో, మూడు శతాబ్ధాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని, అదే బంజారాహిల్స్ నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా వున్నదని సీఎం అన్నారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని సీఎం అన్నారు.

అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం వారు చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు. ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా వున్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు. బంజారాలకు స్ఫూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా వున్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని సీఎం అన్నారు. బంజారా/లంబాడా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి.. ‘మా తాండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చి, గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేశామన్నారు.

అంతేకాకుండా ప్రతి తాండా గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పరిపాలన భవన్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ దిశగా గిరిజన సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం ఫరిడవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదుగుతుండడం తనకెంతో సంతోషంగా వుందని సీఎం అన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్ ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించామన్నారు. అందులో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన చేశామని సీఎం అన్నారు. వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =