రేపు రాష్ట్ర మంత్రులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ భేటీ, పలు కీలక శాఖలపై చర్చ

CM KCR, CM KCR Conference with District Collectors, CM KCR Meeting with District Collectors, CM KCR will Held a Meeting with All the Ministers, KCR Meeting All Ministers, KCR Meeting Over Covid 19 Vaccine, KCR Meeting Over Palle Pragathi, KCR Meeting With District Collectors, Mango News Telugu, Pattana Pragathi, Pattana Pragathi Programme, Telangana CM KCR, Telangana CM KCR Latest News

రేపు (జనవరి 11, సోమవారం) ఉదయం 11.30 గంటల నుండి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చ:

రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సీఎం ఇటీవల ప్రగతిభవన్ లో సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సోమవారం జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ ఏర్పాటు, పార్ట్-బిలో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చ:

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై సమీక్ష:

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది? తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షిస్తారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమావేశంలో సమీక్షిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు.

విద్యా సంస్థల్లో తరగతుల ప్రారంభంపై చర్చ:

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశానికి కలెక్టర్లు, అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =