తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు

COVID 19 Updates, COVID-19, COVID-19 Cases In Telangana, COVID-19 Latest Updates In Telangana, Covid-19 Updates in Telangana, Mango News, telangana, Telangana Corona Updates, telangana coronavirus cases today, telangana coronavirus updates, Telangana Covid 19 Cases, Telangana Covid-19 Cases New Reports, Telangana COVID-19 Deaths Reports, Telangana COVID-19 Report, Telangana COVID-19 Reports, Telangana Reports, Telangana State COVID-19 Update

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 1, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,108 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే మరో ఇద్దరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1546 కి పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 535 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,79,991 కు చేరుకుంది. ప్రస్తుతం 5,571 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 69 లక్షలు దాటింది. శుక్రవారం నాడు 26,590 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 69,51,297 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,86,762 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =