జేఎన్టీయూహెచ్‌ బీటెక్ అకడమిక్ క్యాలెండర్ 2022-23 విడుదల, ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ఎప్పటినుంచంటే?

JNTUH Released Academic Calendar of BTech First Year 1st and 2nd Semesters, JNTUH Academic Calendars, JNTUH B.Tech 1-1, JNTUH B.Tech 1-2, BTech First Year 1st and 2nd Semesters,Mango News, Mango News Telugu, JNTUH B.TECH, JNTUH 1-2 Academic Calendar, JNTUH B.Tech, JNTUH B.Pharmacy, JNTUH B.Tech 1-1 & 1-2 Semester , JNTUH Academic Calendar 2022, Jntuh Academic Calendar 2022-23 For 1st Year, JNTUH Latest News And Updates

జ‌వ‌హార్‌లాల్ నెహ్రు టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్‌) బీటెక్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్ ను (2022-23) మరియు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఫార్మసీల యొక్క ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ లకు సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్ ను విడుదల చేసింది. జేఎన్టీయూ పరిధిలోని అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫస్ట్‌ సెమిస్టర్ తరగతులు నవంబర్‌ 3 ప్రారంభం కానున్నాయి. బీటెక్ ఫస్ట్‌ సెమిస్టర్‌ లో వర్కింగ్ డేస్ 93 రోజులు, సెకండ్‌ సెమిస్టర్‌ లో 92 రోజుల ఉంటాయని తెలిపారు. ఈ మేరకు జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటన చేశారు.

అలాగే ఎంబీఏ, ఎంసీఏ ఫస్ట్‌ సెమిస్టర్ తరగతులు నవంబర్ 10న ప్రారంభం కానుండగా, అక్టోబర్ 26 నుంచే ఎంటెక్‌, ఎంఫార్మసీ ఫస్ట్‌ సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కోర్సులకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ 2022-23 వివరాలను జేఎన్టీయూ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ (అకడమిక్ క్యాలెండర్ 2022-23) వివరాలు:

ఫస్ట్ సెమిస్టర్:

  • క్లాసుల ప్రారంభం: నవంబర్ 3
  • ఫస్ట్‌ స్పెల్‌ ఆఫ్ ఇన్స్ట్రుక్షన్స్ : నవంబర్‌ 3 నుంచి డిసెంబర్‌ 12 వరకు (8 వారాలు)
  • ఫస్ట్‌ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ : డిసెంబర్‌ 29 నుంచి 2023, జనవరి 4 వరకు (1 వారం)
  • యూనివర్సిటీకి ఫస్ట్‌ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ మార్క్స్ సమర్పణ: జనవరి 10 (ముందు లేదా ఆ తేదీన)
  • సెకండ్‌ స్పెల్‌ ఆఫ్ ఇన్స్ట్రుక్షన్స్ : 2023, జనవరి 5 నుంచి మార్చి 2 వరకు (8 వారాలు)
  • సెకండ్ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ : మార్చి 3 నుంచి మార్చి 9 వరకు (1 వారం)
  • ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ : మార్చి 10 నుంచి మార్చి 16 వరకు (1 వారం)
  • యూనివర్సిటీకి సెకండ్ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ మార్క్స్ సమర్పణ: మార్చి 16 (ముందు లేదా ఆ తేదీన)
  • ఎండ్ సెమిస్టర్/ ఫస్ట్‌ సెమిస్టర్‌ ఎగ్జామ్స్: మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు (2 వారాలు)

సెకండ్ సెమిస్టర్:

  • సెకండ్ సెమిస్టర్ క్లాసుల ప్రారంభం: 2023, ఏప్రిల్ 3
  • ఫస్ట్‌ స్పెల్‌ ఆఫ్ ఇన్స్ట్రుక్షన్స్ : 2023 ఏప్రిల్ 3 నుంచి జూన్ 10 వరకు (10 వారాలు)
  • వేసవి సెలవులు : 2023, మే 15 నుంచి మే 27 (2 వారాలు)
  • ఫస్ట్‌ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ : జూన్ 12 నుంచి వరకు జూన్ 17 వరకు (1 వారం)
  • యూనివర్సిటీకి ఫస్ట్‌ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ మార్క్స్ సమర్పణ: జూన్ 23 (ముందు లేదా ఆ తేదీన)
  • సెకండ్‌ స్పెల్‌ ఆఫ్ ఇన్స్ట్రుక్షన్స్ : 2023, జూన్ 19 నుంచి ఆగస్టు 12 వరకు (8 వారాలు)
  • సెకండ్ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ : ఆగస్టు 14 నుంచి 19 వరకు (1 వారం)
  • ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ : ఆగస్టు 21 నుంచి 16 వరకు (1 వారం)
  • యూనివర్సిటీకి సెకండ్ మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌ మార్క్స్ సమర్పణ: ఆగస్టు 26 (ముందు లేదా ఆ తేదీన)
  • ఎండ్ సెమిస్టర్/ సెకండ్ సెమిస్టర్‌ ఎగ్జామ్స్: ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు (2 వారాలు).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eight =