హైదరాబాద్‌కు అరుదైన గుర్తింపు

Hyderabad Gets Top Rank In World Most Dynamic Cities List, Hyderabad In World Most Dynamic Cities List, Mango News Telugu, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, World Most Dynamic Cities List
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్‌’  2020కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లుగా పేర్కొంది. జేఎల్‌ఎల్‌ సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌–2020 గ్లోబల్ నివేదికను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి రామారావు జనవరి 18, శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ నిలవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. జేఎల్‌ఎల్‌ నివేదికలోని మొదటి 20 స్థానాల్లో భారతదేశానికి చెందిన 7 ప్రముఖ నగరాలు చోటు సంపాదించాయి. బెంగళూరు రెండో స్థానంలో నిలువగా, చెన్నై (5), ఢిల్లీ (7), పుణె (12), కోల్‌కతా (16), ముంబయి (20) స్థానాల్లో నిలిచాయి.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nine =