వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, మరో 4 నెలలు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

Approves Bill to Repeal Three Farm Laws in Upcoming Winter Session, Cabinet approves bill to repeal three farm laws, Cabinet approves Farm Laws Bill, Cabinet approves Farm Laws Repeal Bill, Cabinet approves Farm Laws Repeal Bill 2021, Mango News, Union Cabinet approves bill to repeal 3 farm laws, Union Cabinet approves bill to repeal three contentious farm laws, Union Cabinet approves bill to repeal three farm laws, Union Cabinet approves Farm Laws Repeal Bill, Union Cabinet approves proposal to repeal three farm laws, Union Cabinet Key Decisions

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పక్రియనంతా పూర్తి చేసిందని, రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నామని చెప్పారు.
  • దేశంలో రేషన్ కార్డులు కలిగిఉన్న పేద ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేలా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరాను మరో నాలుగు నెలల పాటు అనగా డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూలో విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ సరఫరా వ్యాపారం యొక్క ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం.
  • నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్‌ను వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందే అప్రెంటిస్‌లకు స్టైపెండియరీ మద్దతు కింద రూ.3,054 కోట్లు నిధులు కేటాయింపు. దేశంలో పరిశ్రమలు మరియు వాణిజ్య సంస్థల ద్వారా శిక్షణ పొందే దాదాపు 9 లక్షల మంది అప్రెంటీస్‌ల లబ్ది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − sixteen =