సెప్టెంబర్ నెలలో రూ.1,17,010 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు

Gross GST Revenue, Gross GST Revenue Collected in Month Of September 2021, Gross GST Revenue Collected in September 2021, GST Revenue, GST Revenue Collected In Sept 2021, GST Revenue Collection, GST revenue collection 2021, GST Revenue Collection News, GST revenue collection September, GST Revenue Collection Updates, Mango News, Monthly GST Revenue Collection, Rs 117010 Cr Gross GST Revenue Collected in Month Of September 2021

దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్ నెలలో లక్ష కోట్లు దాటాయి. సెప్టెంబర్ నెలలో గ్రాస్ జీఎస్టీ వసూళ్లు మొత్తం రూ.1,17,010 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్ నెల జీఎస్టీ ఆదాయతో పోల్చితే ఇది 23% ఎక్కువని తెలిపారు. రూ.1,17,010 కోట్లలో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,578 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.26,767 కోట్లు, ఐజీఎస్టీ రూ.60,911 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.29,555 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.8,754 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.623 కోట్లు) వసూలు అయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.28,812 కోట్లు మరియు సీజీఎస్టీకి రూ.24,140 కోట్లు రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా సెటిల్ చేసింది. సెప్టెంబర్ 2021 నెలలో రెగ్యులర్ సెటిల్‌మెంట్‌ల తర్వాత కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.49,390 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీ కొరకు రూ.50,907 కోట్లుగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =