తెలంగాణలో వెబ్‌సైట్‌, మీ-సేవ ద్వారా కూడా ఆస్తుల నమోదుకు అవకాశం

Dharani Project, Non-agricultural Properties for Dharani Project, Online Facility Launched for Enlistment, Online Facility Launched for Enlistment of Non-agricultural Properties, telangana, Telangana Dharani Project, Telangana Dharani Project News, Telangana Non agricultural Properties, Telangana Non agricultural Properties Registration

తెలంగాణలో ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడానికి మరియు స్థిరమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సమగ్ర వ్యవస్థగా ధరణి ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల కోసం డేటాబేస్ సృష్టించి, ప్రజలకు మెరూన్ కలర్ నాన్-అగ్రికల్చర్ ఇమ్మోవబుల్ ప్రాపర్టీ పాస్‌బుక్‌లు (ఎన్‌పిబి) జారీ చేయనున్నారు. రాష్ట్రంలో ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ప్రజల నుండి అవసరమైన సమాచారం ఇప్పటికే సేకరిస్తున్నారు. డేటా సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 24,400 మంది అధికారులను నియమించారు. అక్టోబర్ 17 నాటికి రాష్ట్రంలో 75.74 లక్షలకు పైగా ఆస్తులు నమోదు చేయబడ్డాయి.

ఆన్‌లైన్ లో స్వయంగా నమోదు చేసుకునే అవకాశం:

ఈ నేపథ్యంలో ఆస్తుల నమోదును మరింత సులభతరం చేసేలా జీహెఛ్ఎంసీ మరియు ఇతర మునిసిపాలిటీలలోని రెండు కొత్త విధానాలు ప్రారంభించారు.

–> Www.npb.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా యజమానులే స్వయంగా ఆస్తి వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.
–> మీ-సేవ కేంద్రాల ద్వారా ఆస్తుల నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మీ-సేవ కేంద్రాల్లో ఆస్తుల నమోదు సౌకర్యం ఉచితంగా లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో మీ-సేవకు చెల్లించాల్సిన సేవా ఛార్జీలను సంబంధిత జీహెచ్‌ఎంసీ/మునిసిపాలిటీ భరిస్తుందని పేర్కొన్నారు.

యజమానులు ఆస్తి నమోదు కోసం ఈ క్రింది సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది:

  • ఆధార్ నంబర్ (మోసపూరిత లావాదేవీల నుండి ఆస్తిని రక్షించడానికి)
  • మొబైల్ నంబర్ (యజమానులకు వారి ఆస్తికి సంబంధించి అలర్ట్స్/సమాచారం పంపడం)
  • కుటుంబ సభ్యుల వివరాలు-యజమాని ప్రకటించిన విధంగా(కుటుంబ సభ్యుల ఆస్తి హక్కులను పొందడం కోసం)
  • యజమాని యొక్క ఫోటో (మెరూన్ పాస్ బుక్ లో ముద్రించడానికి)
  • ప్లాట్ యొక్క విస్తీర్ణం/నిర్మించిన ప్రాంతం
  • ఈ సమాచారాన్ని యజమానులు స్వచ్ఛంద ప్రాతిపదికన అందించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.

ఈ రెండు విధానాలు జీహెచ్‌ఎంసీ మరియు మునిసిపాలిటీల్లో తక్షణమే అందుబాటులో వస్తాయని చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికే ఆస్తులు నమోదు చేసుకున్న వారు ఈ విధానాలను ఉపయోగించి మళ్లీ నమోదు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నారైలు, ఓసిఐలు మరియు విదేశీ పౌరుల ఆస్తుల నమోదుకు సంబంధించిన విధానం గురించి విడిగా ఆదేశాలు జారీ చేయబడతాయని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − six =