జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Reacts on Stampede Incident at Gymkhana grounds for T20 Match Tickets, Pawan Kalyan Reacts on Stampede At Gymkhana Grounds, Gymkhana Grounds T20 Match Tickets Stampade, Gymkhana Grounds T20 Match Tickets Issue, 3rd T20 between India and Australia, Ind Vs Aus T20 on 25th Sep, T20 at Uppal Stadium, India vs Australia T20 Series, India vs Australia T20, Ind vs Aus T20 Series Third T20 Match, Ind vs Aus Match, Ind vs Aus Match Uppal Stadium, Mango News, Mango News Telugu, India vs Australia T20 Series , India vs Australia T20 Match, Indian Captain Rohit Sharma, Australia Captain Aaaron Finch, India Vs Australia Live Updates, India Vs Australia Match Live Scores

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ టికెట్లను, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) గురువారం ఉదయం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో విక్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

“భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల సందర్భంగా సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరం. అక్కడి తొక్కిసలాట, లారీ ఛార్జ్ వల్ల గాయాల పాలైన 20 మందికిపైగా క్రీడాభిమానులు, 10 మంది పోలీసులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఆసక్తిని అంచనా వేసి పకడ్బందీ ఏర్పాట్లు చేసి పారదర్శకంగా విక్రయాలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావు. ఈ ఘటనపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =