వర్షాల నేపథ్యంలో బ్యాక్టీరియా, వైరస్‌లతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం – డీహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చరిక

Telangana DH Srinivasa Rao Warns People Over Seasonal Diseases Due to Continuous Rains, Srinivasa Rao Warns People Over Seasonal Diseases Due to Continuous Rains, Seasonal Diseases Due to Continuous Rains, Continuous Rains, Seasonal Diseases, Due to incessant rains and wet weather conditions, wet weather conditions, Due to incessant rains, Telangana Health Director Srinivasa Rao, Health Director Srinivasa Rao, Telangana Health Director, DH Srinivasa Rao, Srinivasa Rao, Continuous Rains In Telangana News, Continuous Rains In Telangana Latest News, Continuous Rains In Telangana Latest Updates, Continuous Rains In Telangana Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో గడచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పు బయటకు రావొద్దని ఆయన సూచించారు. ఈ సమయంలో బ్యాక్టీరియా, వైరస్‌ల వలన సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ హెచ్చరించారు. ప్రజలు తవిధిగా మాస్క్‌లు ధరించాలని, ఒకవేళ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లు గణనీయమైన సంఖ్యలో నమోదవుతున్నాయని, అయితే ఎక్కువ మంది రోగులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు మూలాన వైరల్ మరియు డెంగ్యూ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల విస్తరణకు అనువైనవిగా మారాయని శ్రీనివాసరావు అన్నారు. ఎడతెగని వర్షాలు మరియు తడి వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే వారాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తర్వాత డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇప్పటివరకు 1,184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే ఈ ఏడాది డెంగ్యూ తో పాటు టైఫాయిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయని వెల్లడించారు. దోమలు వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

తాజా కూరగాయలు, వేడివేడి ఆహారం తీసుకోవాలని డీహెచ్ సూచించారు. ఈ సమయంలో బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రత విషయంలో రాజీపడకూడదని, అలాగే మంచి నీరు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, గోరువెచ్చటి నీటిని తీసుకోవడం శ్రేయస్కరమని వివరించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఇప్పటికే తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో గర్భిణులు డెలివరీకి ఒక వారం ముందే ఆసుపత్రుల్లో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డీహెచ్ సూచించారు. జలుబు, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని, దీనికోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉంచామని శ్రీనివాసరావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 8 =