తెలంగాణలో జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

Mango News Telugu, Political Updates 2020, Sankranti Holidays From January 11th To 16th, Telangana Breaking News, Telangana Govt Declares Sankranti Holidays, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020, Telangana Sankranti Holidays
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. తిరిగి జనవరి 17న పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవని తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ తన అకాడమిక్ క్యాలెండర్‌లో స్పష్టం చేసింది. అయితే పలు విద్యా సంస్థలు సంక్రాంతి సెలవులు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. అక్టోబర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్వహించడం వలన తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను మరికొన్ని రోజులు పాటు పొడిగించింది. దీనివల్ల సిలబస్ పెండింగ్‌లోనే ఉండిపోయిందని భావిస్తూ, సంక్రాంతి సెలవుల్లో కోత విధించి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వాల్సిందేనని ప్రకటించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =