మాస్కు ధరించకుంటే వెయ్యి జరిమానా, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

1000 Penalty for not Wearing Mask, Fine on mask in Hyderabad, Mango News, Telangana Govt, Telangana Govt Imposes Fine, Telangana Govt Imposes Fine For Mask Violators, Telangana Govt Imposes Fine of Rs 1000 on Mask, Telangana Govt Imposes Rs 1000 Penalty for not Wearing Mask, Telangana Govt Tightens Rules Amid Rise in COVID-19, Telangana govt to impose penalty, Telangana imposes 1000 penalty for not wearing mask, Telangana imposes Rs 1000 penalty on not wearing face masks

ఇటీవల రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ముందుగా కరోనా నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు (కార్యాలయాలు), ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పకుండా ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా మాస్కులు ధరించకుండా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని 51 నుండి 60 వరకు గల సెక్షన్ల కింద, అలాగే ఐపీసీ సెక్షన్ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతుండడంతో జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని వారికీ రూ.1000 జరిమానా విధించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం జారీచేసిన ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు/ఎస్పీలకు ప్రభుత్వం సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eight =