తెలంగాణ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ కాళోజీ పురస్కారానికి ఎంపిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్

2021 Prajakavi Kaloji Award, Dr Penna Shiva Rama Krishna, Dr Penna Shiva Rama Krishna for Prajakavi Kaloji Award, Dr Penna Shiva Rama Krishna for Prajakavi Kaloji Award 2021, Mango News, Minister Srinivas Goud, Prajakavi Kaloji Award, Prajakavi Kaloji Award 2021, Telangana Govt Selected Dr Penna Shiva Rama Krishna for Prajakavi Kaloji Award, Telangana Govt Selected Dr Penna Shiva Rama Krishna for Prajakavi Kaloji Award-2021

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ వైతాళికులను స్మరించుకునే దిశగా ఎన్నెన్నో కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన మహనీయులను, తేజోమూర్తులను ఎప్పటికప్పుడు గౌరవించుకుంటూ వస్తున్నామని, ఆ క్రమంలోనే ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని (సెప్టెంబర్ 9) ప్రతి సంవత్సరం అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తుందని చెప్పారు.

తెలంగాణ సాహితీవేత్త పెన్నా శివరామ కృష్ణను కాళోజీ పురస్కారానికి ఎంపిక:

అంతేకాకుండా 2015 సంవత్సరం నుంచి కాళోజి పురస్కారాన్ని ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజున ఒక సాహితీవేత్తకు ఆ అవార్డును అందజేస్తున్నామని అన్నారు. ఈ 2021 సంవత్సరానికి ప్రభుత్వం నిపుణులతో ప్రత్యేకంగా ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి ఆ ఎంపిక కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ సాహితీ వేత్త పెన్నా శివరామ కృష్ణను కాళోజీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం నాడు జీ.ఓ.ఆర్.టి.నం.261ను జారీ చేశారు. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను సెప్టెంబర్ 9 ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కాళోజీ జయంతి ఉత్సవాలలో పెన్నా శివరామ కృష్ణకు అందించనున్నారు.

పెన్నా శివరామకృష్ణ ప్రముఖ సాహితీవేత్త. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన లెక్చరర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన “అలల పడవల మీద”, “నిశబ్దం నా మాతృక” వంటి కవితా సంకలనాలను ప్రచురించారు. గజల్ ప్రక్రియపై ఆయన చేసిన రచనలు ఎంతో ప్రశంసలు పొందాయి. అలాంటి సాహితీవేత్తకు కాళోజీ పురస్కారం ప్రకటించడం సంతోషంగా భావిస్తున్నానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సాహిత్యం పట్ల ఉండే అభిమానానికి, కవుల పట్ల ఉండే గౌరవానికి, కళాకారుల పట్ల ఉండే ఆదరానికి ఇలా ప్రతి సంవత్సరం ప్రజాకవి కాళోజీ పేరిట, మహాకవి దాశరథి పేరిట పురస్కారాలు ఇవ్వడమే ఒక ఉదాహరణగా భావించవచ్చని చెప్పారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, వివిధ రంగాలలో విశేష కృషి చేసిన తెలంగాణా బిడ్డలను అవార్డులతో సత్కరిస్తూ సీఎం కేసీఆర్ తన కళాభిమానాన్ని చాటుతున్నారని చెప్పారు. ఇలా తెలంగాణలోని ప్రముఖ వ్యక్తులను గౌరవించుకునే మంచి సంప్రదాయాన్ని పోషిస్తున్న సీఎం కేసీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =