తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు

Telangana Intermediate Public Exams-2022 Schedule Revised, Intermediate Public Exams-2022 Schedule Revised, Telangana Intermediate Public Exams-2022, Intermediate Public Exams-2022, Schedule Revised, Telangana, Intermediate Public Exams, Intermediate Public Exams Latest News, Intermediate Public Exams Latest Updates, Intermediate Public Exams Live Updates, 2022 Intermediate Public Exams, Intermediate Public Exams-2022 Schedule, 2022 Intermediate Public Exams Schedule Revised, 2022 Intermediate Public Exams Schedule, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను ఇటీవలే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే 10వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అయితే జేఈఈ మెయిన్స్ మొదటి దశ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రివైజెడ్ షెడ్యూల్ ను బుధవారం నాడు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరగనున్నాయి. అలాగే జనరల్, ఒకేషనల్ కోర్సులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 11 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు ఏప్రిల్ 12న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • ఏప్రిల్ 22: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • ఏప్రిల్ 25: ఇంగ్లీష్ పేపర్-1
  • ఏప్రిల్ 27: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, పొలిటికల్ సైన్స్ పేపర్- 1
  • ఏప్రిల్ 29: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • మే 2: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • మే 6: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
  • మే 9: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • మే 11: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • ఏప్రిల్ 23: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • ఏప్రిల్ 26: ఇంగ్లీష్ పేపర్ -2
  • ఏప్రిల్ 28: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, పొలిటికల్ సైన్స్ పేపర్- 2
  • ఏప్రిల్ 30: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • మే 5: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • మే 7: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2
  • మే 10: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • మే 12: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =