తెలంగాణలో మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు, కొత్త షెడ్యూల్ ఇదే…

Telangana Intermediate Public Exams-2022 will be Held from May 6 to 24th New Schedule Released, Telangana Intermediate Public Exams-2022 will be Held from May 6 to 24th, Telangana Intermediate Public Exams-2022 New Schedule Released, Telangana Intermediate Public Exams-2022, Telangana Intermediate Public Exams, 2022 Telangana Intermediate Public Exams, Intermediate Public Exams 2022, 2022 Intermediate Public Exams, Intermediate Public Exams-2022 will be Held from May 6 to 24th, Intermediate Public Exams-2022 will Start from May 6, Intermediate Public Exams-2022 will End On May 24th, Public Exams-2022, 2022 Public Exams, Telangana Intermediate Exams, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజాగా సవరించిన టైమ్ టేబుల్/షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి మే 23 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, మే 7 నుంచి మే 24 వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరగనున్నాయి. అలాగే జనరల్, ఒకేషనల్ కోర్సులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 11 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు ఏప్రిల్ 12న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

ముందుగా జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ దృష్ట్యా తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవలే ఏప్రిల్ 22 నుంచి మే 12వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేలా సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే జేఈఈ మెయిన్స్-2022 మొదటి విడత పరీక్షల తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా నిర్ణయం తీసుకుంది. మొదటి విడత పరీక్షలను ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను మరోసారి మారుస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరోసారి సవరించిన షెడ్యూల్ ను బుధవారం నాడు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మే 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • మే 9: ఇంగ్లీష్ పేపర్-1
  • మే 11: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, పొలిటికల్ సైన్స్ పేపర్- 1
  • మే 13: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • మే 16: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • మే 18: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
  • మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • మే 23: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మే 7: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • మే 10: ఇంగ్లీష్ పేపర్ -2
  • మే 12: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, పొలిటికల్ సైన్స్ పేపర్- 2
  • మే 14: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • మే 17: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • మే 19: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2
  • మే 21: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • మే 24: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 15 =