తెలంగాణలో లాక్‌డౌన్‌: రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతి

Cabinet Decided to Allow Registration of Lands, Cabinet Decided to Allow Registration of Lands Properties, Mango News, Registration Of Lands, telangana, Telangana cabinet announces slew of measures, Telangana Cabinet Key Decisions, Telangana cabinet takes key decisions, Telangana extends lockdown by 10 days, Telangana extends lockdown till June 9, Telangana govt extends statewide complete lockdown, Telangana Lockdown, Telangana Lockdown 3.0

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ను మరో 10 రోజులు పొడిగించిన నేపథ్యంలో కోవిడ్, లాక్‌డౌన్‌ సడలింపు నిబంధనలను అనుసరించి ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ధరణి పోర్టల్ ద్వారా నేటి (మే 31) నుంచి వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు, ఇతర లావాదేవీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. తహశీల్దార్ కార్యాలయాలు మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటాయని, ఆ రోజుకు షెడ్యూల్ చేయబడిన అన్ని స్లాట్లు ఈ సమయంలోపే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్స్ సందర్భంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. కాగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులతో పాటుగా ఇద్దరు సాక్షులకు మాత్రమే అనుమతి ఉంటుందని, బయటి వ్యక్తులు అనుమతించబడరని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − three =