తెలంగాణలో మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల, ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌ల్లో 677 పోస్టుల భ‌ర్తీ

Telangana TSLPRB Releases 2 Notifications to Recruit 677 Posts in Excise Transport Departments, TSLPRB Releases 2 Notifications to Recruit 677 Posts in Excise Transport Departments, Telangana State Level Police Recruitment Board Recruitment, Telangana Excise and Transport Recruitment 2022, 2022 Telangana Excise and Transport Recruitment, Telangana Excise and Transport Recruitment, 677 Posts in Excise Transport Departments, 677 Posts in Transport Departments, 677 Posts in Excise Departments, Telangana Police Recruitment 2022, 2022 Telangana Police Recruitment, Telangana Police Recruitment, Telangana Police Recruitment News, Telangana Police Recruitment Latest News, Telangana Police Recruitment Latest Updates, Telangana Police Recruitment Live Updates, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వరుసగా పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 పోస్టుల భ‌ర్తీకి రెండు నోటిఫికేష‌న్స్ విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ర‌వాణా శాఖ‌లో 6 ట్రాన్స్‌ పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) పోస్టులు, 57 ట్రాన్స్‌ పోర్ట్ కానిస్టేబుల్‌(ఎల్‌సీ) పోస్టులకు మరియు ఎక్సైజ్ శాఖలో 614 ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ పోస్టుల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మాలో మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌ఎల్‌పీఆర్బీ సూచించింది.

రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీలో భాగంగా ముందుగా ఏప్రిల్ 25న 16,614 పోలీసు ఉద్యోగాల‌కు టీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేష‌న్‌ ను విడుదల చేసింది. అలాగే తెలంగాణ యువత ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ను ఏప్రిల్ 26, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. గ్రూప్‌-1 కు సంబంధించి 18 విభాగాలకు చెందిన 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో కూడా 677 పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =