ఏపీ జల వనరుల శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు

Ambati Rambabu Take Charges as Minister For Water Resources of AP Today, Ambati Rambabu Take Charges as Minister For Water Resources of AP, Ambati Rambabu Take Charges as Minister For AP Water Resources Today, AP Water Resources Minister, Water Resources Minister, AP Water Resources Minister Ambati Rambabu, Minister Ambati Rambabu, Ambati Rambabu, new reshuffled Cabinet Ministry of Andhra Pradesh, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, AP CM, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జల వనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడం అదృష్టమని, దీనిని తాను ఒక బాధ్యతగానే చూస్తానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ప్రారంభమైన పోలవరాన్ని తాము పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని, అవినీతికి చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్మాణాలను చేపడతామని వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన అంబటి రాంబాబు ఇటీవల ఏపీ కేబినెట్‌లో చోటు సంపాదించుకున్నారు.

పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌డ్యామ్‌, డయాఫ్రమ్‌వాల్‌ను అస్తవ్యస్తంగా నిర్మించారని, అసలు ముందుగా స్పిల్‌వే నిర్మాణం చేపట్టాల్సి ఉందని మంత్రి అంబటి రాంబాబు ఇటీవలే పేర్కొన్నారు. కాఫర్‌డ్యామ్‌, డయాఫ్రమ్‌వాల్‌ పనులు లోపభూయిష్టంగా జరగడంతో వాటిని సరిదిద్దేందుకు రాష్ట్ర ఖజానాకు అదనంగా ₹800 కోట్లు నష్టం వాటిల్లిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 45.72 మీటర్ల వద్ద నీటిని నింపి ఆ తర్వాత పునరావాస పనులు ప్రారంభించడం సాంకేతికంగా తప్పని, డ్యామ్‌ను 41.15 మీటర్లకు నింపాలని, ముంపు గ్రామాల్లో పూర్తి పునరావాసం కల్పించి, క్రమంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని అన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు మరియు వరదల కారణంగా ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని, ప్రాజెక్టు మొత్తం నిర్మాణం ఆలస్యమవడానికి ఇదే ప్రధాన కారణమన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nine =