మరి విజయం ఫిక్సా!!

And Success Is Fixa,Chandrababu Naidu,Manifesto,AP State Assembly Elections,TDP vs YSRCP,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,YSRCP,TDP,TDP News,Janasena,Pawan Kalyan,TDP-Janasena-BJP Public Meeting,TDP Manifesto,Chandrababu Naidu News,TDP Public Meeting,Chandrababu Praja Galam,Praja Galam,Chandrababu And Pawan Kalyan Public Meeting,Chandrababu LIVE,TDP Praja Galam,Chandrbabu Election Campaign

తెలుగు రాష్ట్రాల్లో ఒక‌టైన తెలంగాణ‌లో నాలుగు నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అధికారంలోకి రావ‌డానికి ఆరు గ్యారెంటీలు దోహ‌ద ప‌డ్డాయి. క‌ర్ణాట‌క స్ఫూర్తితో ఆరు గ్యారెంటీల‌ను తెర‌పైకి తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌.. ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేసింది. విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ ఆరు గ్యారెంటీల త‌ర‌హాలోనే ప్ర‌చారంలో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. అయితే.. అక్క‌డ తెలుగుదేశం కూట‌మి వాటికి సూప‌ర్ సిక్స్ అని పెట్టుకుంది. అందులోని కొన్ని ప‌థ‌కాలూ వేరే అనుకోండి. అయితే.. తెలంగాణ‌లో ఆరు.. ఏపీలో సిక్స్.. లాంగ్వేజీలు వేరైన‌ప్ప‌టికీ.. అర్థం ఒక‌టే. ఏపీ కూట‌మి కీల‌కంగా ఫోక‌స్ పెట్టింది.. ప్ర‌చారం చేస్తోంది.. ఆరు ప‌థ‌కాల‌పైనే.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో కూడా కూట‌మి నేత‌లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ , తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు మాట్లాడుతూ.. కూటమి తరపున స్పష్టమైన అజెండాతో వస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ ద్వారా ఆడ బిడ్డలను శక్తి వంతులుగా మారుస్తామని హామీ ఇచ్చారు. అద‌నంగా వాలంటీర్ల వేతనాలను 10 వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు కామ‌న్ అనుకోండి. వాటిని ప‌క్క‌న పెడితే.. సంక్షేమ పథకాల విషయంలో జ‌నం బాగా ఆకర్షితుల అవుతుండడంతో, టిడిపి కూడా ప్రజా ఆకర్షణ పథకాలకు రూపకల్పన చేసింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మేనిఫెస్టోలోని కొన్నిటిని ప్రాతిపదికగా తీసుకుని టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుప‌రిచింది.

ఎక్క‌డ స‌భ జ‌రిగినా సూప‌ర్ సిక్స్ ను ప్ర‌ధానంగా జ‌నాల‌కు వివ‌రిస్తోంఇ. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల గ్యారంటీ కార్డులతో కూడిన కిట్ ను ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమానికి ఇప్పటికే మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ ఈ కిట్ల పంపిణీ జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్ర‌చారం చేస్తూనే, తాము అధికారంలోకి వస్తే వెంటనే ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు వంటివి ఈ హామీల్లో చేర్చారు.నిరుద్యోగులు, మహిళలను ఆకట్టుకునే విధంగా టిడిపి మేనిఫెస్టో ఉంది.మహాశక్తి ,అన్నదాత, యువగళం, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్ వంటివి సూపర్ సిక్స్ లో ఉన్నాయి. మ‌రి తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను ఆరు గ్యారెంటీలు అధికారంలోకి తెచ్చినట్లుగానే.., ఏపీలో సూప‌ర్ సిక్స్ కూట‌మికి అధికారం క‌ట్ట‌బెడుతుందో.. లేదో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =