తెలంగాణ రాష్ట్ర సంగీత‌, నాట‌క అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా దీపికా రెడ్డి నియామకం, ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

Telangana Deepika Reddy Appointed as The Chairperson of State Sangeet Natak Akademi, Deepika Reddy Appointed as The Chairperson of State Sangeet Natak Akademi, Chairperson of Telangana State Sangeet Natak Akademi, Telangana State Sangeet Natak Akademi Chairperson, Sangeet Natak Akademi Chairperson, Sangeet Natak Akademi, Deepika Reddy, Telangana Sangeet Natak Akademi, TS Sangeet Natak Akademi Chairperson, Chairperson of Sangeet Natak Akademi, Sangeet Natak Akademi News, Sangeet Natak Akademi Latest News, Sangeet Natak Akademi Latest Updates, Sangeet Natak Akademi Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర సంగీత‌, నాట‌క అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా దీపికా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం కీలక ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌ద‌విలో దీపికా రెడ్డి రెండేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. 1965, సెప్టెంబ‌ర్ 15న జ‌న్మించిన దీపికా రెడ్డి చిన్నతనం నుంచి కళలపై మక్కువతో నాట‌క రంగం వైపు ఆకర్షితులయ్యారు. తన కృషితో నాటక రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన దీపికా రెడ్డి ప్ర‌స్తుతం కుచిపూడి నాట్య‌కారిణిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా కెరీర్ కొన‌సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది యువతకి ఆమె నాట్యంలో శిక్షణనిస్తున్నారు. నాటక రంగంలో ఆమె కృషికి గుర్తింపుగా పలు అవార్డులు ఆమెను వరించాయి.

కాగా ఆమె 2016లో తెలంగాణ స్టేట్ అవార్డును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక 2017లో నేష‌న‌ల్ సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డును అప్పటి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. కూచిపూడి ప్రచారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న దీపిక తన శిష్యులకు సంపూర్ణ శిక్షణ ఇవ్వడంతోపాటు వారిలో అత్యుత్తమమైన ప్రతిభను వెలికితీయడంపై దృష్టి పెడతారు. ఆమె రాజీవ్ గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో కూచిపూడి ప్రాక్టికల్ లెక్చరర్‌గా కూడా పనిచేశారు. దీపిక ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ‘రినైసాన్స్ ఆఫ్ ఆర్ట్, సైన్స్ అండ్ స్పోర్ట్’ అనే అంశంపై సవివరణాత్మక పేపర్‌ను కూడా సమర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =