మంచు మోహన్‌ బాబు కీలక ప్రకటన – తిరుపతిలో ‘మోహన్‌ బాబు యూనివర్సిటీ’ స్థాపన

Actor Mohan Babu, Andhra Pradesh, Mango News, MBU University, Mohan Babu, Mohan Babu announces MBU University, Mohan Babu announces MBU University in Tirupathi, Mohan Babu Announces Mohan Babu University, Mohan Babu Announces Mohan Babu University in Tirupati, Mohan Babu University, Mohan Babu University in Tirupati, Telugu actor Mohan Babu announces university in Tirupati, Tirupati, Tollywood actor Mohan Babu announces Mohan Babu University, Tollywood actor Mohan Babu announces university

టాలీవుడ్‌ లో తొలిరోజుల్లో విలన్‌ పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు సీనియర్‌ హీరో మంచు మోహన్ బాబు. ఆయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్‌ అయ్యారు. ఒకవైపు వెండితెరపై రాణిస్తూనే మరోవైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్‌ అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్‌ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

“శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న దశకి చేరుకుంది. తిరుపతిలో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ని కృతజ్ఞతతో మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం. మీరు కూడా నా ఈ స్వప్నానికి మద్దతు ఇస్తారని విశ్వసిస్తున్నాను” అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా .. విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 10 =