ఏపీలో కొత్త మంత్రులు వీళ్ళే…25 మందితో నూతన కేబినెట్

AP Cabinet Reshuffle CM YS Jagan Finalized List of 25 New Ministers, CM YS Jagan Finalized List of 25 New Ministers, AP Cabinet Minister's Final List Announced Details Here, YSRCP has released a list of 25 new Cabinet ministers, AP Cabinet Minister's Final List, AP new Cabinet ministers, 25 new Cabinet ministers, new Cabinet ministers, AP New Cabinet, AP Cabinet reshuffle, Andhra Pradesh Cabinet reshuffle, Andhra Pradesh, Andhra Pradesh Cabinet, YS Jagan Mohan Reddy Cabinet reshuffle, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఏప్రిల్ 11, సోమవారం) కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. కొత్త కేబినెట్ లో మొత్తం 25 మందికి చోటు కల్పించారు. అయితే 25 మందిలో గతంలో పనిచేసిన 11 మంది మంత్రులకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రమంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంజాద్‌ భాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్‌, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేష్‌ వంటి వారిని మళ్ళీ కొనసాగించారు.

కొత్తగా మరో 14 మందికి సీఎం వైఎస్ జగన్ మంత్రులుగా అవకాశం కల్పించారు. 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. కొత్త కేబినెట్ లో 10 మంది బీసీ, ఐదుగురు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒకరు మైనార్టీ, నలుగురు కాపు, నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరికీ చోటుదక్కలేదు. మరోవైపు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఏపీలో కొత్త మంత్రులు వీళ్ళే…25 మందితో నూతన కేబినెట్:

 1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 2. బొత్స సత్యనారాయణ
 3. అంజాద్‌ భాషా
 4. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
 5. గుమ్మనూరు జయరాం
 6. నారాయణస్వామి
 7. పినిపె విశ్వరూప్‌
 8. తానేటి వనిత
 9. సీదిరి అప్పలరాజు
 10. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
 11. ఆదిమూలపు సురేష్‌
 12. ధర్మన ప్రసాద రావు
 13. రాజన్న దొర
 14. గుడివాడ అమర్‌నాధ్‌
 15. బూడి ముత్యాలనాయుడు
 16. దాడిశెట్టి రాజా
 17. కారుమూరి నాగేశ్వరరావు
 18. కొట్టు సత్యనారాయణ
 19. జోగి రమేష్
 20. అంబటి రాంబాబు
 21. మేరుగ నాగార్జున
 22. విడదల రజని
 23. కాకాణి గోవర్దన్​ రెడ్డి
 24. ఆర్‌కే రోజా
 25. ఉషా శ్రీ చరణ్‌

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 3 =